ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ఎవరంటే అమితాబ్ బచ్చన్ పేరే చెబుతారు. ఆయన చూడని విజయాల్లేవు. ఆయన అందుకోని స్థాయి లేదు. ఇండియన్ సినిమాలో అమితాబ్ స్థానమే వేరు. ఐతే స్పెషల్ పాత్రలతో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారాయన. 70 ఏళ్లు పైబడ్డాక కూడా చాలా ఉత్సాహంగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు బిగ్-బి. ఆయన త్వరలోనే జాకీ చాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు అభిమానులకు ఉత్సాహం కలిగిస్తున్నాయి.
16 ఏళ్ల తర్వాత అమితాబ్ నటించిన ‘ఆంఖే’ సీక్వెల్ రాబోతోంది.కొందరు అంధులు కలిసి ఒక బ్యాంకు దోపిడీకి పాల్పడే కథతో తెరకెక్కిన చిత్రమిది. పెద్ద హిట్టయింది. అనీస్ బజ్మీ దర్శకత్వంలో త్వరలోనే ‘ఆంఖే-2’ మొదలు కానుంది. . ఈ చిత్ర కథ చైనాలోని కాసినో చుట్టూ తిరుగుతుందట. ఈ నేపథ్యంలో ఈ కథలో ఓ కీలక పాత్ర కోసం జాకీ చాన్ ను అడుగుతున్నారట. అమితాబ్ తో సినిమా అనేసరికి ఆయన కూడా సానుకూలంగానే స్పందించాడట. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం పెద్ద ఎత్తున రిలీజయ్యేందుకు ఆస్కారముంటుంది.
No comments:
Post a Comment