‘వడ చెన్నై’ రిలీజ్ డేట్ విషయంలో చాన్నాళ్లుగా సస్పెన్స్ నడుస్తోంది. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించారు. అక్టోబరు 17న దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.
మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘వడ చెన్నై’ ఒకటి. తమిళ స్టార్ హీరో ధనుష్‌తో అతడి ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్ రూపొందిస్తున్న చిత్రమిది. చెన్నైలో రౌడీయిజానికి పెట్టింది పేరైన వడ చెన్నై ప్రాంతం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో ధనుష్ అన్బు అనే నేషనల్ లెవెల్ క్యారమ్ ప్లేయర్ పాత్ర పోషిస్తున్నాడు. ముందు ఒక సామాన్య కుర్రాడిగా ఉండి.. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో రౌడీయిజంలోకి దిగి.. దాన్నుంచి బయటికి రాలేక సతమతమయ్యే కుర్రాడి పాత్ర అది. గత నెల ధనుష్ పుట్టిన రోజు కానుకగా ‘వడ చెన్నై’ టీజర్ రిలీజ్ చేశారు. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ధనుష్-వెట్రిమారన్ కాంబినేషన్లో మరో క్లాసిక్ రాబోతున్న సంకేతాలిచ్చింది ఆ టీజర్.
ధనుష్‌కు స్టార్ ఇమేజ్ రావడం, అతను గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవడంలో వెట్రిమారన్‌ది కూడా కీలక పాత్రే. కెరీర్ ఆరంభంలో వెట్రి దర్శకత్వంలో చేసిన ‘పొల్లాదవన్’ ధనుష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. వీళ్ల కలయికలో వస్తున్న ‘వడ చెన్నై’పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ఆండ్రియా, ఐశ్వర్యా రాజేష్, సముద్రఖని, కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు.
No comments:
Post a Comment