Saturday, July 28, 2018

7 రోజుల్లో 50కోట్లు వసూలు చేసిన "ధడక్"





 శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ నటించిన మొదటి చిత్రం `ధడక్` ఓపెనింగులతో ఆశించిన ఫలితాన్ని అందించింది. కేవలం మూడు రోజుల్లో 30కోట్లు వసూలు చేసి జాన్వీ క్రేజును అందరికీ అర్థమయ్యేలా చేసినిది . ధడక్ కేవలం 7 రోజుల్లో 50కోట్లు వసూలు చేసింది.  జాన్వీ క్రేజుతో సాధ్యమైందంటే అదంతా శ్రీదేవి మాయ అనే చెప్పాలి. శ్రీదేవికి కూతురి విజయాన్ని కనులారా వీక్షించే అదృష్టం లేకపోయి ఉంది. 


ధడక్ మరో వారం ఆడితే బడ్జెట్ మొత్తం రికవరీ అవుతుంది.. ఈ చిత్రానికి ధర్మ ప్రొడక్షన్స్ అధినేత ఏకంగా 70కోట్ల మేర బడ్జెట్ పెట్టడంతో ఆ మేరకు షేర్ వసూలు చేయాల్సిన సన్నివేశం ఉంది. ఇక జాన్వీ క్రేజు అటు అమెరికా సహా విదేశాల్లోనూ వర్కవుటవ్వడంతో ఈ చిత్రం ఫుల్ రన్లో సేఫ్ ప్రాజెక్టు అవుతుందనే అంచనా వేస్తున్నారు.  డెబ్యూలు ఇద్దరికీ మంచి పేరు తెచ్చింది ధడక్. 100 కోట్ల క్లబ్లో చేరి మరింతగా ఉరకలెత్తిస్తుందేమో చూడాలి.

No comments:

Post a Comment