కర్ణుడు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు
కర్ణుడు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. ఎలాంటి కష్టాన్నైనా.. ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు.తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు.
కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్లాడు. బ్రహ్మా స్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి. ఇతను పరశురాముడితో బ్రాహ్మణుణ్నని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒకరోజున గురువు శిష్యుడి తొడను తల గడగా చేసుకొని నిద్రపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి, అతని తొడలో కన్నం పెట్టడం మొదలు పెట్టాడు. రక్తం కారుతోంది, బాగా బాధ పెడుతోంది. అయినా గురువుగారికి నిద్రా భంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు. అతని ధైర్యాన్ని గమనించి ‘నిజం చెప్పు నువ్వెవ డివి?’ అనేసరికి, ‘నేను సూతుణ్ని’ అని నిజం చెప్పాడు. ‘గురు వైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక, అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు. నీ మరణ సమయ మప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది. ’ అంటూ పరశురాముడు శాపమిచ్చాడు.
పాండవ కౌరవుల అస్త్ర కళా ప్రదర్శ నలో కర్ణుణ్ని చూసి, దుర్యోధనుడు తనకు అర్జునుణ్ని ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు. రాజకుమారుడు కాని వాడు ఈ రంగంలోకి రాకూడదనేసరికి, అతన్ని రాజుగా చేయడానికి అప్పటి కప్పుడే కర్ణుణ్ని అంగ రాజ్యాధినేతగా చేశాడు. అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు అధీనమై, ఉచ్చ నీచాలను చూడ కుండా అధర్మం వైపు చేరిపోయాడు. తల్లే స్వయంగా ‘నువ్వు కౌంతేయుడివే’ అని చెప్పినా, అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా, భీష్ముడు చెప్పినా కూడా, అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరి అయిన దనుకున్నాడు కర్ణుడు
తనవారిని తెలిసి యుద్ధంచేసాడు. తనచేతులారా కొడుకులను,స్నేహితులను,బంధువులను చెపుతున్నానని తెలిసి కర్మకు ఈచిన మాటకు కట్టుబడి తనపేరుకు మచ్చ తెచ్చుకున్నాడు. మహాభారతంలో చెప్పుకోదగిన గోపా యోధుడు కర్ణ .
No comments:
Post a Comment