Wednesday, August 29, 2018

రైళ్లలో షాపింగ్.........

1:18 AM 0 Comments


ఇప్పుడా ఊహను నిజం చేసే దిశగా  రైళ్లలో షాపింగ్ సదుపాయాన్ని కల్పించాలని భావిస్తున్నారు.  సరదాగా.. అలా బోగీలు దాటుకుంటూ వెళ్లి షాపింగ్ బోగీకి వెళ్లి నచ్చిన వస్తువుల్ని కొనుగోలు చేసే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.


టికెట్ల ధరలు పెంచకుండా..వేర్వేరు మార్గాలతో ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్న రైల్వేలు..  తొలుత శతాబ్ది.. కోణార్క్.. చెన్నై ఎక్స్ ప్రెస్ తో పాటు దురంతో రైళ్లలో షాపింగ్ సదుపాయాన్ని కల్పించాలని భావిస్తున్నారు.
 తొలుత శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ప్రయోగాత్మకంగా అమ్మకాలు మొదలు పెట్టాలనుకుంటున్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

టికెట్ల అమ్మకాలతో కాకుండా వేర్వేరు మార్గాలతో ఏటా రూ.1200 కోట్లు సంపాదించే లక్ష్యంలో భాగంగా రైల్వే షాపింగ్ కాన్సెప్ట్ తెర మీదకు వచ్చిందని చెబుతున్నారు. ఈ రైల్వే షాపింగ్ లో భాగంగా సెంట్లు.. బ్యాగులు.. వాచీలు లాంటి అనేక రకాల వస్తువుల్ని అమ్మాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. స్టేషన్ల ద్వారా మరింత ఆదాయాన్ని పెంచుకునే దిశగా రైల్వేస్టేషన్లో ఉన్న బరువు తూచే యంత్రాల స్థానంలో బాడీ మాస్ ఇండెక్స్ కియోస్క్ లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

 అంతేకాదు.. రానున్న రోజుల్లో రైల్వే స్టేషన్లలో ఫుట్ మసాజ్ రోబోటిక్ ఛైర్లు.. ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నారు.

Sunday, August 26, 2018

2 మిలియన్ క్లబ్ లో 'గీత గోవిందం'

11:10 PM 0 Comments





 'గీత గోవిందం'   మొదటి రోజునుండి పాజిటివ్ మౌత్ టాక్ - రివ్యూస్ తో మొదలైన సినిమా బాక్స్ ఆఫీసుకు పండగ తీసుకొచ్చింది.  అమెరికా విషయమే తీసుకుంటే తాజా అప్డేట్ ప్రకారం $2 మిలియన్ మార్క్ ను దాటింది. 


ఈ సంవత్సరం టాప్ టెన్ కలెక్షన్స్ లిస్టు లో 5 వ స్థానం లో నిలిచింది.



ఇక 2 మిలియన్ డాలర్ క్లబ్ గురించి మాట్లాడుకుంటే విజయ్ కి ఈ క్లబ్ లో మొదటి సినిమా 'గీత గోవిందం'.
ఇక ఈ ఘనత సాధించడం ద్వారా మిడ్ రేంజ్ స్టార్ హీరోల్లో ఓవర్సీస్ లో స్ట్రాంగ్ అయి విజయ్ దేవరకొండ గ్రేట్ అనిపించుకున్నాడు. ఈలెక్కన గోవిందం హంగామా మామూలుగా లేదు.

Saturday, August 25, 2018

‘వడ చెన్నై’ రిలీజ్ డేట్...

3:07 AM 0 Comments




‘వడ చెన్నై’ రిలీజ్ డేట్ విషయంలో చాన్నాళ్లుగా సస్పెన్స్ నడుస్తోంది. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించారు. అక్టోబరు 17న దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.

 మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘వడ చెన్నై’ ఒకటి. తమిళ స్టార్ హీరో ధనుష్‌తో అతడి ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్ రూపొందిస్తున్న చిత్రమిది. చెన్నైలో రౌడీయిజానికి పెట్టింది పేరైన వడ చెన్నై ప్రాంతం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో ధనుష్ అన్బు అనే నేషనల్ లెవెల్ క్యారమ్ ప్లేయర్ పాత్ర పోషిస్తున్నాడు. ముందు ఒక సామాన్య కుర్రాడిగా ఉండి.. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో రౌడీయిజంలోకి దిగి.. దాన్నుంచి బయటికి రాలేక సతమతమయ్యే కుర్రాడి పాత్ర అది. గత నెల ధనుష్ పుట్టిన రోజు కానుకగా ‘వడ చెన్నై’ టీజర్ రిలీజ్ చేశారు. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ధనుష్-వెట్రిమారన్ కాంబినేషన్లో మరో క్లాసిక్ రాబోతున్న సంకేతాలిచ్చింది ఆ టీజర్.

 ధనుష్‌కు స్టార్ ఇమేజ్ రావడం, అతను గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవడంలో  వెట్రిమారన్‌ది కూడా కీలక పాత్రే. కెరీర్ ఆరంభంలో వెట్రి దర్శకత్వంలో చేసిన ‘పొల్లాదవన్’ ధనుష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.  వీళ్ల కలయికలో వస్తున్న ‘వడ చెన్నై’పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ఆండ్రియా, ఐశ్వర్యా రాజేష్, సముద్రఖని, కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు.

బిగ్-బితో జాకీచాన్ సినిమా

2:42 AM 0 Comments




 ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ఎవరంటే అమితాబ్ బచ్చన్ పేరే చెబుతారు. ఆయన చూడని విజయాల్లేవు. ఆయన అందుకోని స్థాయి లేదు.  ఇండియన్ సినిమాలో అమితాబ్ స్థానమే వేరు. ఐతే స్పెషల్ పాత్రలతో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారాయన.  70 ఏళ్లు పైబడ్డాక కూడా చాలా ఉత్సాహంగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు బిగ్-బి. ఆయన త్వరలోనే  జాకీ చాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు అభిమానులకు ఉత్సాహం కలిగిస్తున్నాయి.









16 ఏళ్ల తర్వాత అమితాబ్  నటించిన ‘ఆంఖే’ సీక్వెల్ రాబోతోంది.కొందరు అంధులు కలిసి ఒక బ్యాంకు దోపిడీకి పాల్పడే కథతో తెరకెక్కిన చిత్రమిది. పెద్ద హిట్టయింది.  అనీస్ బజ్మీ దర్శకత్వంలో త్వరలోనే ‘ఆంఖే-2’ మొదలు కానుంది. . ఈ చిత్ర కథ చైనాలోని కాసినో చుట్టూ తిరుగుతుందట. ఈ నేపథ్యంలో ఈ కథలో ఓ కీలక పాత్ర కోసం జాకీ చాన్ ను అడుగుతున్నారట. అమితాబ్ తో సినిమా అనేసరికి ఆయన కూడా సానుకూలంగానే స్పందించాడట.  అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం పెద్ద ఎత్తున రిలీజయ్యేందుకు ఆస్కారముంటుంది.