Thursday, June 28, 2018

మరో మల్టీస్టారర్ సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్



మరో మల్టీస్టారర్ సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్, గురు తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వెంకటేష్ , వరుణ్ తేజ్ తో కలసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టగా నాగచైతన్యతో కలసి బాబీ దర్శకత్వంలో మరోసారి కూడా ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నది. కాగ  మరో మల్టీస్టారర్ సినిమాకు కూడా వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. నేను లోకల్ దర్శకుడు త్రినాథరావు తో చేసేందుకు వెంకటేష్ ఆసక్తి చూపుతున్నాడట.

ఈ సినిమాలకు రచయితగా పనిచేసిన ప్రసన్న కుమార్ చెప్పిన లైన్ నచ్చడంతో వెంకటేష్ పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేయమని చెప్పడంతో ప్రస్తుతం ఆ వర్క్ లో ఉన్నాడని తెలుస్తుంది. అది ఓకే అయితే దీన్ని సోలోగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. హలో గురు ప్రేమకోసమే షూటింగ్ పూర్తయ్యాక త్రినాథరావు దీనికోసం రంగంలో దిగాడు. కానీ ఈ సినిమాకు మరో హీరో కూడా కావాలి. ద్విభాషా చిత్రంగా రూపొందించి కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను తెలుగులో పరిచయం చేసేలా ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.

 సరైన కథ అవకాశం కోసం ఎదురుచూస్తున్న సూర్య అయితేనే వెంకటేష్ సమానంగా మెప్పించగలడని తెలిపింది. ఈ మేరకు త్వరలోనే ప్రసన్న, త్రినాథ రావు ఇద్దరూ కలిసి  చెన్నైలో సూర్యను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్టు తెలిసింది.

No comments:

Post a Comment