Thursday, June 28, 2018

బిజినెస్ మొదలు పెట్టిన అరవింద సమేత




తెలుగులో విడుదలకు ముందే భారీ బిజినెస్ లు జరుపుకుంటున్నాయి.  తాజాగా త్రివిక్రమ్ సినిమా మంచి బిజినెస్ తో సరికొత్త రికార్డులని క్రియేట్ చేస్తుతు  అందరిని షాక్ కి గురిచేసింది.

ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే భారీ ధరకు క్లోస్ అయినట్లు తెలుస్తుంది.  త్రివిక్రమ్ మార్కెట్ లో ఏమాత్రం తేడా రాలేదని తెలుస్తుంది. ఎందుకంటే అరవింద సమేత మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిసినెస్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

ఎక్కువగా ఆంధ్ర ఏరియాల్లో ఈ సినిమా 40 కోట్ల వరకు ధర పలికిందని తెలుస్తుంది. ఈస్ట్, వెస్ట్ గోదావరి ఏరియాల్లో కలిపి 12 కోట్ల వరకు అమ్ముడుపోయింది సమాచారం. నిర్మాత మరికొన్ని రోజుల్లో వాటిని కూడా క్లోస్ చేసే అవకాశం ఉన్నది.  మరి ఈ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తున్న అరవింద సమేత ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి.


No comments:

Post a Comment