యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరగా నటించిన చిత్రం . ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించిన జై లవకుశ మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అన్నదమ్ముల అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించాడు. తాజగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది.
సౌత్ కొరియాలో జరగబోయే ఫిలిం ఫెస్టివల్ లో జైలవకుశ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
ఈ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు ఆరు ఇండియా చిత్రాలని ఎంపిక చేశారు. టైగర్ జిందా హై, మెర్సల్, ఇజ్రా. సీక్రెట్ సూపర్ స్టార్, మామ్, జైలవకుశ చిత్రాలు ఎంపిక కావడం విశేషం.
తెలుగు నుంచి ఎంపికైన ఏకైక చిత్రం జైలవకుశ. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో మూడు వైవిధ్యాలు చూపిస్తూ అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ నటన మరో స్థాయిలో ఉంటుంది. నత్తితో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ అదుర్స్.
బెస్ట్ ఏషియా కేటగిరిలో ఈ చిత్రాలు ఎంపికయ్యాయి. జులై 21, 22 తేదీల్లో ఈ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది.
No comments:
Post a Comment